రోహిత్ ను మేము కొంటామని చెప్పట్లేదు.. కానీ.. సంజయ్ బంగర్ షాకింగ్ కామెంట్స్?

praveen
2024 ఐపీఎల్ సీజన్ ముగిసింది. దీంతో ఇండియాలో ఎక్కడ చూసినా కూడా 2025 సీజన్ గురించి చర్చ జరుగుతుంది. కాగా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మెగా వేలం నిర్వహించడం విషయంలో ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తూ బీసీసీఐ బీజీ బీజీగా ఉంది. అన్ని ఫ్రాంచైజీలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా వేలం జరగబోతున్న నేపథ్యంలో.. స్టార్ ప్లేయర్లు ఎవరెవరు వేలంలోకి వస్తారు ఒకవేళ ఇలా స్టార్ ప్లేయర్లు వేలంలోకి వస్తే వారికి ఎంత ధర దక్కుతుంది అనే విషయం గురించి కూడా చర్చ జరుగుతుంది.

 కాగా ప్రస్తుతం టీమిండియా కు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వస్తాడు అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది రోహిత్ ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అర్థాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇక ఇప్పుడు సాదాసీదా ఆటగాడిగా మాత్రమే రోహిత్ జట్టులో కొనసాగుతున్నడు. దీంతో అతను ముంబైని వదిలి వేలంలోకి రావాలని అనుకుంటున్నాడట. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే అతన్నిఏ జట్టు సొంతం చేసుకుంటుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.  ఈ క్రమంలోనే రోహిత్ ఆ టీంలోకి వెళ్లబోతున్నాడు. ఈ టీంలోకి వెళ్ళబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయ్.

 అయితే ఇదే విషయం గురించి పంజాబ్ కింగ్స్ జట్టు డైరెక్టర్గా కొనసాగుతున్న టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వదిలేసి వేలంలోకి వస్తే అతనికి భారీ ధర పలకడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతడిని కొనుగోలు చేయడానికి పంజాబ్ ప్రయత్నిస్తుందా అని ప్రశ్నిస్తే.. రోహిత్ వేలంలోకి వస్తే పంజాబ్ తీసుకుంటుంది అన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేను. కానీ పంజాబ్ తో పాటు లక్నో, ఢిల్లీ కూడా అతని కోసం వేలంలో పోటీపడే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సంజయ్ బంగర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: