బీసీసీఐ కొత్త సెక్రటరీ ఆయనేనా.. ఫిక్స్ అయిపోయిందట?

praveen
గత కొంతకాలం నుంచి ఇండియన్ క్రికెట్ లో ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే  టి20 ఫార్మాట్ కు కెప్టెన్గా కొనసాగిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేసాడు. దీంతో ఇక భారత జట్టుకు t20 ఫార్మాట్లో కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇక భారత జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగిన రాహుల్ ద్రావిడ్ పదవీకాలం కూడా ముగియడంతో ఇక టీమ్ ఇండియాకు కొత్త హెడ్ కోచ్ మార్పు కూడా తప్పనిసరిగా మారిపోయింది. దీంతో టీమ్ ఇండియాకు కొత్త టి20 కెప్టెన్ గా  సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయగా కోచ్ గా గౌతమ్ గంభీర్ ను సెలెక్ట్ చేశారు.

 ఇలా గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత క్రికెట్ వ్యవహారాలను చూసుకుంటూ బిసిసిఐ సెక్రటరీగా కొనసాగుతున్న జై షా స్థానంలో కూడా కొత్త వ్యక్తి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అటు బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్న జై షా మరికొన్ని రోజుల్లో ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేషన్ వేయబోతున్నాడని.. దాదాపుగా ఆ పదవిజై షాకు వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే జై షా ఐసీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడితే బీసీసీఐ సెక్రటరీగా వచ్చేది ఎవరు అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

 అయితే జై షా అటు ఐసీసీ చైర్మన్ గా వెళ్తే బీసీసీఐ సెక్రటరీగా జై షా స్థానంలో రోహన్ జైట్లీ రాబోతున్నాడట. రోహన్ జైట్లీ బీసీసీఐ సెక్రటరీగా రావడం దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బిజెపి దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ అన్న విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ గా లాయర్ అయినా రోహన్  ప్రస్తుతం ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అటు జై షాకి పూర్తిస్థాయి మద్దతు ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఆ పదవి ఖరారు అయిపోయిందని.. దీంతో రోహన్ ఇక బిసిసిఐ సెక్రటరీగా రావడం కూడా ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: