ఆ ముగ్గురి వల్లే.. వరల్డ్ కప్ గెలవగలిగాం : రోహిత్
ఈ క్రమంలోనే టీమిండియా పై ప్రశంసల వర్షం కురిసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఒక్క ఓటమి కూడా లేకుండా ఏకంగా వరల్డ్ కప్ టైటిల్ అందుకోవడంతో అటు భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ పై కూడా అందరూ ప్రశంసల వర్షం కురిపించారు అని చెప్పాలి. కాగా రోహిత్ శర్మ కెప్టెన్ గా ఇక టీమిండియా మరో వరల్డ్ కప్ కూడా గెలిచి తీరుతాడని అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే t20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర వహించిన మూడు స్తంభాల గురించి ఇటీవలే ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆ ముగ్గురి కారణంగానే వరల్డ్ కప్ గెలవగలిగాం అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇటీవల సియట్ అవార్డు వేడుకలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ కలెక్టర్ అజిత్ అగర్కర్లకు వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ ఇచ్చేశాడు. ఫలితాల గురించి ఆలోచించకుండా ప్లేయర్స్ అందరూ కూడా ఫీల్డ్ లోకి వెళ్లి స్వేచ్ఛగా రాణించే వాతావరణం కల్పించాలని అనుకున్నాను. దీనికి మూడు స్తంభాల నుంచి నాకు సహాయం అందింది. వాళ్లు జైషా, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగర్కర్ వరల్డ్ కప్ సాధించడంలో అదే ఎంతో కీలకం. అలా అని ప్లేయర్స్ ని తక్కువ చేయలేం అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.