3 మ్యాచుల్లో 190.. అయినా రిషబ్ పంత్ కోసం.. అతన్ని బలి పశువులు చేశారుగా?

praveen
టీమిండియాలో స్థానం కోసం ఎంతలా పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది యంగ్ ప్లేయర్లు భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు ఎప్పటికప్పుడు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటూ.. భారత జట్టులో కొనసాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు ఎప్పుడు సిరీస్ ఆడిన కూడా అటు జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది అని చెప్పాలి  అయితే కొన్ని కొన్ని సార్లు బాగా పేరు సంపాదించుకున్న స్టార్ ప్లేయర్ల గురించి అప్పుడప్పుడే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న యువ ఆటగాళ్లను పక్కన పెట్టడం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు రిషబ్ పంత్ కారణంగా ఒక యువ ఆటగాడికి ఇలాగే అన్యాయం జరిగింది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

 రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్ కి దూరంగా ఉన్న రిషబ్ పంత్ 2024 ఐపీఎల్ లో పునరాగమనం చేశాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఇక టీమిండియాలోకి కూడా వచ్చాడు. అయితే ఇక ఇప్పుడు టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ పాల్గొనే అవకాశం ఉంది. అయితే పంత్ రాకతో కొంతమంది యువ ప్లేయర్ల స్థానం గల్లంతయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. టెస్ట్ ఫార్మాట్లో అద్భుతమైన రికార్డులు ఉన్న రిషబ్ పంతుని ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించడం భారత సెలక్టర్లకు కష్టమే.

 అయితే పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్ కు దూరమైనప్పుడు కే ఎస్ భరత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ జూరల్ లాంటి ప్లేయర్లు వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇంగ్లాండ్ తో స్వదేశంలో  జరిగిన సిరీస్లో దృవ జూరల్ కు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతను అద్భుతంగా వినియోగించుకున్నాడు. కీపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాదు మూడు మ్యాచ్ లలో 190 పరుగులు చేసి బ్యాటింగ్ లోను ఆకట్టుకున్నాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ స్టార్ ప్లేయర్ రిషబ్ పంతునూ జట్టులోకి తీసుకోవడం కోసం ఈ యువ ఆటగాడిని సెలెక్టర్లు పక్కన పెట్టాలని అనుకుంటున్నారట. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: