వైరల్ : సూర్య కుమార్ మ్యాజిక్ బౌలింగ్ చూసేయండి?

praveen
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఎక్కడ చూసిన కూడా సూర్య కుమార్ యాదవ్ గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ లోని సరికొత్త అవతారాన్ని ఇటీవల ప్రేక్షకులు అందరూ చూసేసారు. సాధారణంగా జట్టుకు కెప్టెన్సీ అందుకున్న తర్వాత ఏ ఆటగాడిలోనైనా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఎంతో అగ్ర సీవ్ గా ఉన్న ఆటగాడు కెప్టెన్ గా మారిన తర్వాత మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించడం చూస్తూ ఉంటాము. ఇంకొంతమంది ఆటగాళ్లు కెప్టెన్ గా మారిన తర్వాత తమ పేషెన్స్ కోల్పోయి అగ్ర సివ్ గా మారిపోతుంటారు అని చెప్పాలి.

 అయితే సూర్య కుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఎలా మారుతాడో అని చూడ్డానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే స్టార్ బ్యాట్స్మెన్ గా  కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ కొత్త అవతారం ఎత్తాడు.  బౌలర్ గా కూడా మారిపోయాడు. సాధారణంగా బ్యాట్స్మెన్లు అటు మ్యాచులలో బౌలింగ్ చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే తప్పకుండా గెలుస్తాము అనుకున్న పరిస్థితుల్లో ఏదో సరదాకి అలా బౌలింగ్ చేస్తూ ఉంటారు బ్యాచ్ మెన్లు. కానీ సూర్య కుమార్ అలా కాదు డెత్ ఓవర్గా పిలుచుకున్న చివరి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు పరుగులు కావాల్సి ఉన్న పరిస్థితుల్లో బౌలింగ్ చేశాడు.

 దీంతో కెప్టెన్ గా అతను తీసుకుని నిర్ణయం చూసి అందరూ షాక్ లో మునిగిపోయారు. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయారు. ఇక అంతలోనే సూర్యకుమార్ తన బౌలింగ్ తో అందరిని ఫిదా చేసేసాడు. రెండు వికెట్లు తీయడమే కాదు కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో సూపర్ ఓవర్ జరగ్గా సూపర్ ఓవర్ లో కూడా అదరగొట్టిన సూర్యకుమార్ ఇక జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సోషల్ మీడియాలో సూర్యకుమార్ వేసిన ఓవర్ ను మళ్లీ చూసేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సూర్య కుమార్ మ్యాజిక్ ఓవర్ ని చూసేసేయండి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: