బెన్ స్టోక్స్ సాధించిన 'అర్ధ సెంచరీ' రికార్డ్ ఇదే!
సొంత గడ్డపైన వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. జులై 28న ముగిసిన ఈ 3వ టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటడం విశేషంగా చెప్పుకోవచ్చు. మార్క్ వుడ్ (14-1-40-5) సెకెండ్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను చిత్తు చిత్తు (175 ఆలౌట్) చేశాడు. అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 7.2 ఓవర్లలో సునాయాసంగా రీచ్ కాగలిగింది. ఇక బెన్ స్టోక్స్ అయితే ఓపెనర్‌గా దిగి విండీస్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాడు.
కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అవును, ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్ తరఫున ఇయాన్ బోథమ్ (28 బంతులు) పేరిట ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డ్ ఉండేది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే... టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ (21) పేరిట ఉంది. అయితే మ్యాచ్ విషయానికొస్తే స్వల్ప లక్ష్య ఛేదనలో స్టోక్స్‌కు జతగా బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) కూడా బంతితో ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఓవర్‌నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది (175 పరుగులకు ఆలౌట్).
మార్క్ వుడ్ విండీస్‌కు చుక్కలు చూపించాడని చెప్పుకోవచ్చు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టడం జరిగింది. ఇక విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ తృటిలో సెంచరీ చేజార్చుకొని 95కి పరిమితం అయ్యాడు. ఇలా బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో అదరగొట్టారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌట్ అయింది.