వికెట్ తీయగానే.. రియాన్ పరాగ్ బ్యాట్స్మెన్ ను తిట్టేసాడుగా?

praveen
రియాన్ పరాగ్.. ఇతను ఎప్పుడు క్రికెట్ ఆడినా కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాడు అన్న విషయం తెలిసిందే. గతంలో ఐపీఎల్ ఆడుతున్న సమయంలో సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రవర్తించడం కారణంగా వార్తల్లో నిలిచాడు. దీంతో సోషల్ మీడియా జనాలు ఇతన్ని బిల్డప్ బాబాయ్ అంటూ పిలవడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో మాత్రం మంచి ప్రదర్శన చేసి ఇక తనకు వచ్చిన బిల్డప్ బాబాయ్ ట్యాగ్ను పోగొట్టుకున్నాడు. ఇక తన ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు అని చెప్పాలి  అంతేకాదు టీమ్ ఇండియా సెలెక్టర్లు చూపును ఆకర్షించి భారత జట్టులో చోటు కూడా సంపాదించుకున్నాడు.


 జింబాబ్వే పర్యటన ద్వారా అటు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్ పరాగ్ ఆ పర్యటనలో పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ అతని ప్రతిభ పైన నమ్మకం ఉంచిన సెలెక్టర్లు ఇప్పుడు శ్రీలంక పర్యటనలో t20 జట్టులో కూడా అతనికి స్థానం కల్పించారు. అయితే ఈ టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తవ్వగా బ్యాటింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రియాన్.. బౌలింగ్లో మాత్రం అదరగొట్టేసాడు. 8 బంతులను మాత్రమే వేసి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు కూడా క్లీన్ బౌల్డ్ ద్వారా సాధించడం గమనార్హం.



 కాగా 17వ ఓవర్లో బంతిని అందుకున్న రియాన్ పరాగ్ కామెందు మొండిస్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక అంతర్జాతీయ టి20 లలో అతనికి ఇదే మొదటి వికెట్. దీంతో అతను సంబరాలు కాస్త దూకుడుగానే చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఏకంగా బ్యాట్స్మెన్ ను సైతం దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే రియాన్ పరాగ్ సంబరాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫస్ట్ వికెట్ తీసినప్పుడు ఆ మాత్రం సంబరాలు ఉంటాయని కొంతమంది అంటుంటే.. ఇలాంటి అత్యుత్సాహమే చివరికి కెరియర్ను పాడు చేసింది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: