బరితెగించిన పాండ్యా..రూ.3 కోట్లు పెట్టి మరీ ?

Veldandi Saikiran

అనన్య పాండే ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అనన్య పాండే. ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అనన్య పాండే పేరు విపరీతంగా వినిపిస్తోంది. ఏవో కొన్ని వ్యక్తిగత విషయాలతో ఈ అమ్మడు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
ఇక రీసెంట్ గా అనన్య పాండే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి వెళ్లి అక్కడ సందడి చేసింది. ఇక ఆ వివాహంలో హార్దిక్ పాండ్యాతో కలిసి చిందులు వేసింది. అప్పటినుంచి వీరిద్దరి మీద అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ పాండ్యాను ఫాలో అవడంతో వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.... పెళ్లి కూడా చేసుకుంటారంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.... అనన్య లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు మూడు కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక అనన్య పాండే కొనుగోలు చేసిన ఈ కారుపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ కారును పాండ్యా గిఫ్ట్ గా కొనిచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఈ కారు ధర రూ. 3 కోట్లు ఉంటుందట. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.... త్వరలోనే వివాహం చేసుకుంటారని... అందుకే పాండ్యా అనన్య కోసం ఈ  కారును కొనిచ్చాడని సోషల్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా,  టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా ఇటీవలే.. విడాకులు తీసుకున్నాడు. తన భార్య నటాషాకు విడాకులు ఇస్తున్నట్లు స్వయంగా ప్రకటించాడు టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా. ఆ మేరకు సోషల్‌ మీడియాలో ప్రకటన చేశారు టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: