హైబ్రీడ్ మోడ‌ల్లో ఛాంపియ‌న్స్ ట్రోపీ క్రికెట్‌... భార‌త్ మ్యాచ్‌లు ఎక్క‌డంటే..?

praveen
పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నిషేధం నేపథ్యంలో ఈ రెండు దేశాలు ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం అస్సలు జరగదు. ఇక మిగతా దేశాలతో ఆడినట్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఆడవు అన్న విషయం తెలిసిందే. కేవలం ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నిలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలపడటం చూస్తూ ఉంటాం. అందుకే ఈ దాయాదుల పోరుకు ఇక ప్రపంచ క్రికెట్లో ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు పోరు జరిగిన కూడా చిరకాల ప్రత్యార్థుల పోరు అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

అయితే గత ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరగగా భారత్ జట్టు ఇక పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అటు భారత్ కోసం ప్రత్యక్షంగా ఒక వేదికను ఏర్పాటు చేసింది. టీం ఇండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఏం జరగబోతుంది అనే విషయంలో అందరిలో ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఇక పాకిస్తాన్ వేదికగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతూ ఉండగా.. తాము పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధంగా లేము అంటూ అటూ బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

 అయితే అటు పాకిస్తాన్ క్రికెట్ టోర్ని మాత్రం భారత్ వేదికగా జరిగిన వన్ డే వరల్డ్ కప్ కోసం తాము భారత్ కు వెళ్ళినప్పుడు.. టీమ్ ఇండియా ఎందుకు పాకిస్తాన్ రాదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ టీమ్ ఇండియా పాకిస్తాన్ కు రాకపోతే ఆ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తాము అంటూ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా అటు ఛాంపియన్ ట్రోఫీ ఆడుతుందా లేదా అనే విషయం కాక ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9వ తేదీ వరకు జరగబోతుంది టోర్నీ. ప్రతిపాదిత షెడ్యూల్ను కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు icc కి అందించింది. భద్రత రవాణా పరమైన కారణాల దృశ్య భారత్ జట్టుకు లాహోర్లోని గాడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ బీసీసీఐ మాత్రం అటు పాకిస్తాన్కు టీమిండియాని పంపిందేందుకు సుముఖంగా లేదు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆడే మ్యాచ్లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా నిర్వహించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తప్పకుండా భారత్ తమ దేశానికి రావాల్సింది అంటే పట్టుబడుతుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: