టి20 వరల్డ్ కప్ లో భారీ స్కామ్.. విచారణకు ఆదేశించిన ఐసీసీ?

praveen
ఇటీవలే వెస్టిండీస్, యుఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా అఖండ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నుంచి జైత్రయాత్రను కొనసాగించిన టీమిండియా.. అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటుంది. ఒక్క ఓటమి లేకుండా అన్ని టీమ్స్ ని ఓడిస్తూ ఫైనల్ వరకు చేరుకున్న టీమ్ ఇండియా ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే  ఇక ఫైనల్ మ్యాచ్లో ఏకంగా ఓడిపోయే స్థితిలో కూడా అద్భుతంగా పోరాడి గెలిచింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టి20 ఫార్మాట్లో ఐసీసీ టైటిల్ ముద్దాడగలిగింది భారత జట్టు.

 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియా పై ఇప్పటికీ కూడా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇక టి20 వరల్డ్ కప్ గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో భారీ ఫ్రాడ్ జరిగినట్లు ఐసిసి గుర్తించింది. తొలిసారి అమెరికా టి20 వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే  అయితే ఈ టోర్నీ కోసం ఏకంగా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించింది. అమెరికా తో పాటు వెస్టిండీస్ కూడా సంయుక్తంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నినీ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందట. ఐసీసీ కి 165 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.

అమెరికా లాంటి క్రికెట్ కు పెద్దగా ఆదరణ లేని దేశంలో ఈ టోర్ని నిర్వహించడంతోనే ఈ నష్టం వచ్చినట్లు తొలత ఐసీసీ భావించింది  అయితే నష్టం అలా వచ్చింది కాదని.. ఒక స్కాం అని అనుమానాలు తలెత్తడంతో icc దీనిపై ఒక కమిటీ వేసింది. రోజర్, లాసన్ నేడ్, ఇమ్రాన్ కవాజాతో కూడిన కమిటీని నియమించింది ఐసీసీ. స్కామ్ జరిగిన అంశంపై కమిటీ వేయడంతో ఐసీసీ లోని ఇద్దరు హయ్యర్ అఫీషియల్స్ రాజీనామా చేశారు. ఈ స్కామ్ లో వారి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒకవేళ స్కాం జరిగిందని తెలిస్తే ఐసీసీ చైర్మన్, సీఈవోలు సైతం రాజీనామా చేయాల్సి ఉంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: