కోహ్లీ నా బెస్ట్ ఫ్రెండ్.. షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఒకవైపు గాయం వేధిస్తున్న అతను టీమ్ ఇండియా కోసం అద్భుతంగా పోరాడిన తీరు అభిమానులు అందరినీ కూడా ఫిదా చేసేసింది. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత చీలమండ గాయం కి అతను శాస్త్ర చికిత్స చేసుకున్నాడు. దీంతో గత కొంతకాలం నుంచి ఇక భారత జట్టుకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి కీలక ప్లేయర్ లేకుండానే భారత జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా బరిలోకి దిగింది. ఏకంగా టైటిల్ విజేతగా కూడా నిలిచింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో అతను మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహమ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మలు తన బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. వారితో నిరంతరం టచ్ లో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. నా కాలిగాయంపై కూడా వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంటారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ, ఇషాంత్ శర్మ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇక ఇప్పుడు మహమ్మద్ షమీ కూడా వీరి గ్యాంగ్ లో ఉన్నాడు అన్న విషయం ఈ స్టార్ ఫేసర్ వ్యాఖ్యలతో అందరికీ అర్థమైంది. కాగా బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ ద్వారా షమి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.