ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తా.. గంభీర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్?

praveen
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఈ మంచి పదవిని చేజిక్కించుకోవడంతో క్రికెట్ ఫ్యాన్స్, సెలబ్రిటీస్  అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాన కోచ్‌గా ఎంపికైన తర్వాత, గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
"భారతీయుడిగా ఉండటం, నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. ఈసారి కోచ్‌గా తిరిగి వచ్చినందుకు గర్వపడుతున్నా. నా లక్ష్యం ఒక్కటే - ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడం. భారత క్రికెట్ జట్టు 1.4 బిలియన్లకు పైగా ప్రజల కలలను నెరవే చాల్సిన బాధ్యతను కలిగి ఉంది. ఆ కలలను నిజం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను!" అని గౌతమ్ గంభీర్ ఒక పోస్ట్ చేశాడు. దాని తర్వాత చాలా మంది అతనికి కంగ్రాట్యులేషన్స్ చెప్పడం ప్రారంభించారు.
కొత్త కోచ్‌గా ఎన్నికైన  గౌతమ్ గంభీర్‌కు హర్భజన్ సింగ్ అభినందనలు తెలిపాడు, గంభీర్ అద్భుతంగా రాణిస్తాడని తాను నమ్ముతున్నానని చెప్పాడు. దానికి రిప్లైగా గంభీర్ ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు భారత కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ అద్భుతంగా పని చేస్తాడని జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించడంతో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో భారత క్రికెట్ బోర్డు ఇటీవలే గంభీర్‌ను కొత్త కోచ్‌గా ప్రకటించింది.
42 ఏళ్లు గంభీర్ సెలక్షన్ మంచి నిర్ణయం చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ రోల్ కోసం 10 సంవత్సరాలు నిరీక్షించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టైటిల్‌ నెగ్గిన తర్వాత అతను మంచి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు.
 BCCI అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం గంభీర్ జులై 27న ప్రారంభం కానున్న శ్రీలంక సిరీస్ నుంచి టీమిండియా కోచ్ గా అధికారికంగా బాధ్యతలు చేపడతాడు. టీమిండియా శ్రీలంకతో మూడు T20I మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత అనేక ODI మ్యాచ్‌లలో తలపడుతుంది. మరి కోచ్‌ గా గంభీర్ ఎంత మంచి పనితీరును కనబరుస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: