బాబర్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా.. PCB ఏం చెప్పిందంటే?

praveen
పాకిస్తాన్ క్రికెట్ గత కొంతకాలం నుంచి సంక్షోభంలో కూరుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న పాకిస్తాన్ జట్టు ఇక ప్రదర్శన విషయంలో కూడా అంతకంతకు వెనుకబడిపోతూ ఉంది. ఆ జట్టులో ఎప్పుడూ ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఇక ఎవరు కోచ్గా ఉంటారు అన్న విషయం కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా జట్టులోనే ఆటగాళ్ల ప్రవర్తన తీరు కూడా మారిపోయింది.

 మరి ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఐసీసీ ట్రోఫీలలో పాకిస్తాన్ జట్టు తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ముగిసిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో కూడా పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శన చేసింది. ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆ జట్టు కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టలేకపోయింది. మరీ ముఖ్యంగా అటు యూఎస్ఏ లాంటి చిన్న టీం చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆట తీరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి.

 అయితే ఇలా పాకిస్తాన్ జట్టు ఘోర పరాభవం పై ఇంకా విమర్శలు ఆగడం లేదు. దీంతో ఇక ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న బాబర్ అజాంను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా బాబర్ ను సారధ్య బాధ్యతల నుంచి తొలగిస్తారు అంటూ వస్తున్న వార్తలు పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వి స్పందించారు. భవిష్యత్తులో కెప్టెన్ గా బాబర్ కొనసాగడం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై త్వరలోనే కోచ్ కిర్ స్టేన్, మాజీ ఆటగాళ్ల అభిప్రాయం తీసుకుంటాను అంటూ తెలిపాడు మోసిన్ నక్వి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: