వాళ్ల కంటతడి అర్థం కాలేదు.. రోహిత్ ను ఎన్నడు ఇలా చూడలేదు : కోహ్లీ

praveen
వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా రానించి భారత జట్టు కప్పు గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. కాగా ఇటీవలే వరల్డ్ కప్రోఫీతో టీమ్ ఇండియా స్వదేశానికి చేరుకుంది. కాగా ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న తర్వాత అటు టీమ్ ఇండియాకు ఘన స్వాగతం లభించింది అన్న విషయం తెలిసిందే.

 అంతేకాకుండా ఇటీవలే భారత ఆటగాళ్లు అందరూ కూడా వరల్డ్ కప్ ట్రోఫీతో  ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించగా   లక్షలాది మంది అభిమానులు ఈ రోడ్ షో కి తరలివచ్చారు  సుమారు గంటన్నర పాటు సాగిన విజయ యాత్ర భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన ఘట్టంగా నిలిచిపోయింది అని చెప్పాలి. అయితే ర్యాలీ ముగిసిన అనంతరం ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియం కు చేరుకున్నాడు. అక్కడికి వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ కూడా అభివాదం చేసారు. అయితే స్టేడియంలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు 125 కోట్ల నగదు బహుమతిని అందించింది.

 ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ వేదిక పైకి వస్తున్నప్పుడు రోహిత్ రోహిత్ అనే నినాదాలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది అని చెప్పాలి. అయితే ఇదే స్టేడియంలో రోహిత్ విరాట్, కోహ్లీలు కలిసి స్టెప్పులు వేయడం అటు అభిమానులకు మరుపురాని మెమొరీ గా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ లో మాట్లాడిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ నేను చాలా కాలంగా ఈ వరల్డ్ కప్ కోసం ప్రయత్నిస్తున్నాం. మేం ప్రతిసారి ప్రపంచకప్ గెలవాలని కోరుకున్నాం. వంకడేకు ట్రోఫీని తిరిగి తీసుకురావడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే 2011 ప్రపంచకప్ గెలిచిన సమయంలో సీనియర్లు కంటతడి వెనుక ఉన్న బాబోద్వేగం నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఇక 15 ఏళ్లలో రోహిత్ శర్మని కూడా ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు చూడలేదు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: