మరోసారి IND vs PAK మ్యాచ్.. ఈసారి పాకిస్తాన్ లో?

praveen
సాధారణంగా వరల్డ్ క్రికెట్లో ఎన్నో దేశాల మధ్య మ్యాచులు జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్ని దేశాల మధ్య మ్యాచ్లు జరిగినప్పటికీ అటు ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ మాత్రం ఎప్పుడు ప్రత్యేకమే. ఈ రెండు దేశాలు మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో అన్ని జట్ల లాగా ఒక దేశ పర్యటనకు మరో టీం వెళ్లి ద్వైపాక్షిక సిరీస్ ఆడటం అస్సలు జరగదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలబడటం చూస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడో ఒకసారి మాత్రమే జరిగే ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది.

 దీంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి.. ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక వరల్డ్ క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి ఏకంగా హై వోల్టేజ్ మ్యాచ్ అనే పేరు కూడా ఉంది. కాగా మొన్నటికీ మొన్న ముగిసిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మళ్లీ ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులందరూ కూడా ఎదురుచూస్తున్నారు. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరోసారి ఈ దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

 వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. 2025 మార్చి 1వ తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ ఐసీసీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే మార్చ్ 1వ తేదీన లాహోర్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేచి చూస్తున్నా అటు బీసీసీఐ ఇంకా తమ నిర్ణయం వెల్లడించలేదు అన్నది తెలుస్తుంది. తాము ఛాంపియన్స్ ట్రోఫీ ఆడెందుకు పాకిస్తాన్ వెళ్లలేమని.. తమ జట్టు ఆడబోయే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలి అంటూ బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: