హెడ్ కోచ్ గా గంభీర్ కాదు.. తెరమీదకి కొత్త పేరు?

praveen
టీమిండియాకు కొత్తగా రాబోయే హెడ్ కోచ్ ఎవరు? గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం భారత జట్టుకి మూడు ఫార్మాట్లకు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఎప్పుడో ముగిసింది. కానీ బీసీసీఐ పెద్దల స్పెషల్ రిక్వెస్ట్ తో కొన్నాళ్లపాటు ఆ పదవీ బాధ్యతలోనే కొనసాగేందుకు ఆయన అంగీకరించారు. అయితే ఇక ఇప్పుడు ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో.. ఇక కొత్త హెడ్ కోచ్ ను వెతుక్కోవలసిన పరిస్థితి బీసీసీఐకి ఏర్పడింది.

 ఈ క్రమంలోనే కొత్త కోచ్ కోసం ఇటీవల ప్రకటన విడుదల చేయగా.. పలువురు మాజీ ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇక భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ గా రాబోయేది ఎవరు అనే విషయంపై గత కొంతకాల నుంచి చర్చ జరుగుతుంది. అయితే గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్ గా రాబోతున్నాడని ఇది ఇప్పటికే ఫిక్స్ అయిందని.. బిసిసిఐ పెద్దలు ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి చేశారు అంటూ ఇక చర్చ ఇండియన్ క్రికెట్ లో నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు మరో కొత్త పేరు తెరమీదికి వచ్చింది.

 ఏకంగా భారత హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు వినిపిస్తూ ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఎన్సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ భారత హెడ్ కోచ్ గా మారబోతున్నట్లు టాక్ తెరమీదకి వచ్చింది. అయితే జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియాకు కేవలం తాత్కాలిక హెడ్ కోచ్ గా మాత్రమే వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టబోతున్నాడట. ఇక తర్వాత జరిగే శ్రీలంక టూర్లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఛార్జ్ తీసుకొనున్నట్లు  తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. అయితే జింబాబ్వే పర్యటనకు ఐపీఎల్ లో అదరగొట్టిన టీమిండియా యంగ్ స్టార్స్ అందరూ కూడా భారత జట్టులో చోటు సంపాదించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: