WC లో పరాభవం.. విలియమ్సన్ సంచలన నిర్ణయం?

praveen
ప్రస్తుతం యుఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు లీక్ దశ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠ భరితంగా జరగగా.. ఇక నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ కీలక దశలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక వరల్డ్ కప్ టైటిల్ పోరులో మరింత ముందుకు వెళ్లాలని అన్ని టీమ్స్ కూడా ఇక పక్క ప్రాణాలికలను సిద్ధం చేసుకునీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి.. కనీసం సూపర్ 8 కి కూడా అర్హత సాధించలేక.. టోర్నీ నుంచి నిష్క్రమించిన అగ్రశ్రేణి టీమ్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

 ఇలా ప్రపంచకప్ టోర్నీ నుంచి లీగ్ దశతోనే నిష్క్రమించిన టీమ్స్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ అయితే ఎప్పుడు కూడా అటు icc టోర్నమెంట్లలో టైటిల్ పోరులో ముందు ఉంటుంది. అలాంటిది కనీసం సూపర్ 8 కి కూడా అర్హత సాధించకుండా.. ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఆ జట్టు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ప్రదర్శన పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న కేన్ విలియమ్సన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

 ప్రస్తుతం అతను తీసుకున్న నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. ఏకంగా పరిమిత ఓవర్లో ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పకున్న కేన్ విలియంసన్.. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో పరాభవం తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాకుండా 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంటాక్ట్ ను కూడా వదులుకున్నాడు  కేన్ విలియంసన్. ఈ క్రమంలోనే ఈ స్టార్ ప్లేయర్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: