టీమిండియా కొత్త హెడ్ కోచ్ ప్రకటన.. ఎప్పుడో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది అన్న విషయం తెలిసిందే. దీంతో టీమ్ ఇండియాకు హెడ్ కోచ్గా రాబోయేది ఎవరు అనే విషయం పైన గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ క్రికెటర్ల పేర్లు కూడా తెరమీదకి వచ్చి వీళ్లే భారత జట్టుకు నెక్స్ట్ హెడ్ కోచ్ అంటూ ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయంపై మాత్రం అభిమానులకు ఇప్పటికీ ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ భారత జట్టుకు హెడ్ కోచ్గా ఫిక్స్ అయిపోయాడని.. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు అతనితో సంప్రదింపులు కూడా పూర్తి చేశారు అంటూ గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త తెగ వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి సమయంలోనే భారత హెడ్ కోచ్ పదవి కోసం గౌతం గంబీర్ అప్లికేషన్ పెట్టుకోలేదని..  దరఖాస్తు కోసం బిసిసిఐ ఇచ్చిన గడువు కూడా ముగిసిందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ఇలాంటి వార్తలు బీసీసీఐ హెడ్ కోచ్గా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై అందరిలో కన్ఫ్యూషన్ కి కారణం అయ్యాయి అని చెప్పాలి. అయితే ఇక ఇదే విషయం గురించి భారత క్రికెట్లో కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక భారత నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరు అనే ఎప్పుడు క్లారిటీ రాబోతుంది అనే విషయంపై మరో న్యూస్ ప్రసెంట్ తెరమీదకి వచ్చి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది  ఎల్లుండి టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

 అయితే ఇటీవల ఐపీఎల్లో కోల్కతా జట్టు మెంటార్గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసింది అన్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇక డబ్ల్యూవి రామన్ ను కూడా ప్రశ్నించింది. రేపు ఇక ఒక విదేశీయుడు తో పాటు గంభీర్ ని మరోసారి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇలా కోచ్ కి దరఖాస్తు చేసుకున్న వారిని.. షార్ట్ లిస్ట్ చేసి కోచ్ పేరును ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం పోటీలో ముగ్గురు ఉన్నప్పటికీ గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారు అయిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: