భారత్ వరల్డ్ కప్ గెలవాలంటే.. అతను ఫామ్ లో ఉండాలి : పఠాన్

praveen
ప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లాగానే.. ఇక ఇప్పుడు కూడా ఓటమి ఎరుగని జట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎక్కువ పాయింట్లు సాధించి సూపర్ 8 కి కూడా అర్హత సాధించింది. కాగా ఇప్పుడు సూపర్ 8 లో కీలకమైన మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధం అవుతుంది అని చెప్పాలి.

 అయితే భారత జట్టు ఇలా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నందుకు అభిమానులు అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పటికీ జట్టులోని కీలక ప్లేయర్లు కొంతమంది ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడంతో అందరిలో ఆందోళన నెలకొంది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా జడేజా లాంటి కీలక ప్లేయర్లు అందరూ కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో కూడా ఏ ఒక్కసారి మంచి ప్రదర్శన చేయలేదు. దీంతో సూపర్ 8 లాంటి కీలక మ్యాచ్లలో వీళ్లు విఫలమైతే ఇక జట్టుకు భంగపాటు తప్పదు అని ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 మరీ ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఫామ్ లోకి రావడం టీమిండియా కు ఎంతో కీలకము అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫామ్ లో ఉండడం జట్టు విజయానికి ఎంతో కీలకం అంటూ అభిప్రాయపడ్డాడు. అతని బౌలింగ్ సరిగా ఉంటే కుల్దీప్ ను ఆడించేందుకు వీలు ఉంటుంది అంటూ వివరించాడు. హార్దిక్ వేసే లెంత్ బాల్స్ వెస్టిండీస్ పిచ్ లకు బాగా సరిపోతాయి. అతను వేసే బౌన్సర్స్ కట్టర్స్ బంతులను ఎదురుకోవడం బ్యాట్స్మెన్ లకు చాలా కష్టం. ఇక అతనిలో బ్యాటింగ్ ఎలాగో ఉంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: