T20 WC : బ్యాడ్ కి తాకి హెల్మెట్ లో ఇరుక్కున్న బంతి.. చివరికి?

praveen
క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్ అని చెబుతూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఉత్కంఠ ఉంటే ఇంకొన్నిసార్లు మాత్రం క్రికెట్ మ్యాచ్ లో జరిగే సంఘటనలు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా టి20 ఫార్మాట్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాగా ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 ఫార్మాట్లో కూడా ఇలాగే ఒక వైపు ఉత్కంఠతో పాటు మరోవైపు ఎన్నో ఆసక్తికర ఘటనలు కూడా జరుగుతున్నాయి అని చెప్పాలి.

 ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ మధ్య పోరు జరిగింది. అయితే సూపర్ 8 కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉండగా   బంగ్లాదేశ్ విజయం సాధించి అదరగొట్టింది. నెదర్లాండ్స్ పై ఏకంగా 25 పరుగుల తేడాతో విక్టరీని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 159 పరుగులు చేసింది. బంగ్లా ఆల్రౌండర్ షాకిబుల్ హసన్ 64 పరుగులు చేసి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు

 అయితే ఇలా బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఒక హాస్యాస్పదమైన సంఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ వివిఎన్ వేసిన బౌన్సర్ బంగ్లాదేశ్ బాటర్ తన్జీద్ హసన్ హెల్మెట్ కు బలంగా తాకింది. అయితే అదృష్టవశాత్తు  అతనికి ఏ గాయం అవలేదు. కానీ ఇక వేగంగా దూసుకుపోయిన బంతి మాత్రం అతని హెల్మెట్లో ఇరుక్కుంది  అయితే ఇలా హెల్మెట లో ఇరుక్కున్న బంతిని చేతితో తీద్దాం అనుకుంటే ప్రత్యర్థి జట్టు ఎక్కడ అవుట్ అని ఆ ఫీల్ చేస్తుందో అని భయపడి తంచిత్ హెల్మెట్ ను తీసి నేలకు కొట్టాడు  అయినప్పటికీ బంతి బయటకు రాలేదు ఇం దుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: