T20 WC : దరిద్రాన్ని జేబులో పెట్టుకున్నట్టున్నాడు.. ఎలా ఔట్ అయ్యాడో చూడండి?

praveen
జూన్ రెండవ తేదీన ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీలోని అన్ని మ్యాచ్ లు అన్నీ కూడా ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అన్న విషయం తెలుస్తది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. అయితే ఎప్పటిలాగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్స్ కాకుండా అంచనాలు లేకుండా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన చిన్న టీమ్స్ అదరగొడుతున్నారు మరీ ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ జట్టు వరుస విజయాలను సాధిస్తూ దూసుకుపోతోంది  

 ఇప్పటివరకు ఆడిన మూడింటిలో కూడా విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవల పపువా న్యూ గినియా తో జరిగిన మ్యాచ్లో కూడా అదరగొట్టేసింది  ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.5 ఓవర్లలో  95 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. అనంతరం లక్ష్య చేతనలో  ఆఫ్గనిస్తాన్ జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది అని చెప్పాలి  అయితే ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పపువా న్యూ గినియాకు సంబంధించిన బ్యాట్స్మెన్లు నలుగురు కూడా రన్ అవుట్ అవ్వడం గమనార్హం. అయితే కొంతమంది బ్యాట్స్మెన్లు రనౌట్ అయిన తీరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 అజ్మతుల్లా వేసిన 13వ అవర్ తొలి బంతికి నార్మన్ మిడాన్ మీదుగా షార్ట్ ఆడేందుకు ప్రయత్నించి సింగల్ తీయడానికి వెళ్ళాడు. అయితే అక్కడే కాచుకొని ఉన్న రషీద్ ఖాన్ బంతిని అందుకొని వికెట్ల వైపు మెరుపుత్రో విసిరాడు. అయితే బంతి స్టంప్స్ కు తగిలే లోపు నార్మన్ క్రీజ్ లోకి వచ్చేలా దూసుకొచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు క్రీస్తు దూరంలో బ్యాట్ నేలకు తాకి ఆగిపోయాడు.  దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ బ్యాట్స్మెన్ ఎవరో దారిద్రాన్ని జేబులో పెట్టుకుని వచ్చినట్టున్నాడు.. అందుకే ఇక ఇలా వికెట్ కోల్పోయాడు అంటూ ఇంటర్నెట్ జనాలు కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: