ఓడిపోయి ఇంగ్లాండ్ ను ఇంటికి పంపండి.. ఆసిస్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులందరికీ అంచనాలను తారుమారు చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలాగానే ప్రతి వరల్డ్ కప్ లో జరిగినట్లుగా వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న జట్లే ఈ వరల్డ్ కప్ టోర్నీలో కూడా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఈసారి అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.

 అద్భుతంగా రానిస్తాయి అనుకున్న టీమ్స్ అన్నీ కూడా చేత ప్రదర్శన చేసి నిరాశపరిస్తే.. అటు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం సూపర్ ఎయిట్లో ఎంతో సునాయాసంగా అడుగుపెట్టే లాగానే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయితే ఇక ఇంగ్లాండ్ కూడా సూపర్ 8లో అర్హత సాధిస్తుంద లేదా అనే విషయంపై సందిగ్ధత  నెలకొంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టిమ్ ఫైన్ చేసిన కామెంట్లు సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.

 ఇంగ్లాండ్ జట్టుపై తన మనసులో ఉన్న కోపాన్ని మొత్తం అతను బయటపెట్టేశాడు. టి20 వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ ను బయటకు పంపించేందుకు స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా తప్పకుండా ఫలితాలు తారుమారు అయ్యేలా ఆడాలి అంటూ సూచించాడు టిమ్ ఫైన్. ఇది జోక్ గా అనడం లేదని సీరియస్ గానే అంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను చెప్పినట్టు చేయడం కారణంగా టోర్నమెంట్ నుంచి అర్ధంతరంగా ఇంగ్లాండ్ జట్టు నిష్క్రమించి అప్పుడు ఆస్ట్రేలియా టైటిల్ గెలవడానికి మరింత సులభతరం అవుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు ఆ దేశ మాజీ క్రికెటర్ టిమ్ ఫైన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: