పాక్ ఓడిపోతుందని.. ఆ దేశ మాజీ క్రికెటర్ ముందే ఎలా తెలుసబ్బా?

praveen
సాయంత్రం అనగా ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలలో ఏదైనా జట్టు బరిలోకి దిగుతుంది అంటే ఇక ఆ దేశ అభిమానులు అందరూ కూడా తమ దేశ జట్టు తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుందని నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఇక ఆ దేశ మాజీలందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా జట్టుకు మద్దతుగానే నిలుస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఇక ఆ దేశ మాజీ ఆటగాళ్ళ నుంచి సపోర్టు లభించడం లేదు.

 ఎందుకంటే పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఒకరు కూడా పాజిటివ్ గా మాట్లాడటం లేదు. పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో కప్పి గెలిచి చూపించాలి అంటూ ఒకరు సవాల్ విసిరితే.. పాకిస్తాన్ కు అంత సీన్ లేదు అంటూ మరొక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంట్ చేయడం చూస్తూ ఉన్నాం. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా సరే తమ దేశ జట్టు గెలవాలని కోరుకుంటూ ఉంటారు. ఆ జట్టుకి మద్దతుగా నిలుస్తూ ఉంటారు. కానీ ఇటీవల ఒక పాకిస్తాన్ మాజీ ప్లేయర్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 పాకిస్తాన్ జట్టు ఓడిపోతుంది అన్న విషయాన్ని ఆ జట్టు మాజీ ఆటగాడు ముందే చెప్పేసాడు. ఆ మాజీ ప్లేయర్ ఎవరో కాదు డానిష్ కనేరియా. నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ జట్టు తప్పకుండా ఓడిపోతుంది అంటూ డానీష్ కనేరియా చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. మరోసారి మోడీ ప్రధాని కాబోతున్నందుకు అభినందనలు. ఆయన దేశం కోసం చాలా చేశారు. ఇవాళ మోది ప్రధానిగా ప్రమాణోత్సవం, ఇంకోవైపు న్యూయార్క్ లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం భారతీయులకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది అంటూ కనేరియా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: