కోహ్లీని ఆ స్థానంలో పంపితే.. టీమిండియా ఓడిపోతుంది : పాక్ మాజీ
అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకూడదని టీమిండియా ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే పటిష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ లో భాగంగా చిన్న టీం ఐర్లాండ్ పై ఘనవిజయాన్ని అందుకుంది టీమిండియా. కాగా నేడు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపించేందుకు సెలెక్టర్లు నిర్ణయించారు అన్నది తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపించి జట్టు మేనేజ్మెంట్ తప్పు చేస్తుంది అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతడిని మూడో స్థానంలోనే బ్యాటింగ్ కి పంపాలి అంటూ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఓపెనర్ గా వచ్చి త్వరగా అవుట్ అయితే భారత జట్టు ఓడిపోయే ఛాన్స్ ఉంది అంటూ తెలిపాడు. అయితే మూడో స్థానంలో బరిలోకి దిగితే ఒత్తిడికి లోనవ్వకుండా జట్టు గెలిచే వరకు క్రీజ్ లో ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవాలి అంటూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.