స్నేహం అంటే ఇదే.. ఫ్రెండ్ కోసం చిన్నారుల గ్యాంగ్ చేసిన పని వైరల్!

Amruth kumar
ఈ లోకంలో రక్తసంబంధం లేకపోయినా.. కష్టాల్లో తోడుండి, కన్నీళ్లు తుడిచి, ప్రాణానికి ప్రాణంగా నిలిచే ఒకే ఒక్క బంధం ‘స్నేహం’. ‘రెండు దేహాలు.. ఒకే ప్రాణం’ అన్నట్టుగా సాగే ఈ దోస్తీ గురించి ఎన్ని కవితలు రాసినా తక్కువే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే.. ‘నిజమైన స్నేహానికి చిన్నపిల్లలే బ్రాండ్ అంబాసిడర్లు’ అనిపించక మానదు. ఆ చిన్నారి గ్యాంగ్ చేసిన హంగామా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.



ఒక ఫ్లైఓవర్‌పై చిన్నపిల్లల గుంపు నడుచుకుంటూ వెళ్తోంది. అందులో ఒక బాలుడి చేతికి ప్లాస్టర్ వేసి ఉంది. బహుశా ఆ పిల్లాడికి దెబ్బ తగిలి ఉండవచ్చు. కానీ, అక్కడ సీన్ చూస్తే మాత్రం అది ఏదో హాస్పిటల్ యాత్రలా లేదు.. ఒక పెద్ద నాయకుడు తన అంగరక్షకులతో కలిసి వెళ్తున్న ‘విఐపి’ కాన్వాయ్‌లా ఉంది! గాయపడిన స్నేహితుడిని ఒంటరిగా వదిలేయకుండా, ఆ గ్యాంగ్ మొత్తం చుట్టూ చేరి అలెర్ట్ గా వెళ్తోంది. కొందరు ముందు నడుస్తూ దారి క్లియర్ చేస్తుంటే, మరికొందరు వెనుక ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని ఒక కన్నేసి ఉంచారు.ఆ పిల్లాడు ప్రశాంతంగా నడుస్తున్నా, అతని చుట్టూ ఉన్న స్నేహితుల ఉత్సాహం చూస్తుంటే ఏదో పెద్ద యాక్షన్ సినిమాలోని గ్యాంగ్ వార్ సీన్ గుర్తొస్తోంది. ఎక్కడా భయం లేదు.. కేవలం ‘మా దోస్తును మేము కాపాడుకుంటాం’ అనే ధీమా మాత్రమే ఉంది!


ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే.. ఒక చిన్నారి కెమెరా వైపు చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్! “అన్నా.. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వెందుకు చింతిస్తున్నావు? మా దోస్తుకు ఏం కాదు!” అన్నట్లుగా ఆ పిల్లాడు ఇచ్చిన లుక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆసుపత్రికి వెళ్తున్నామనే ఉద్వేగం కంటే, ఇదొక గొప్ప సాహసయాత్ర అన్నట్లుగా ఆ పిల్లలు ప్రదర్శించిన హుందాతనం అద్భుతం. rajbirsingh607 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. “నిజమైన స్నేహం అంటే ఇదే” అంటూ నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.ఈ చిన్నపిల్లల ‘దోస్తీ’ వీడియో ఇచ్చే కిక్కే వేరు. పెద్దవాళ్లు స్వార్థంతో ఆలోచిస్తే, ఈ పిల్లలు మాత్రం కేవలం ‘ప్రేమ’తో తమ స్నేహితుడికి అండగా నిలిచారు.


https://www.instagram.com/reels/DWB29Wqiau7/


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: