ప్రభాస్ నోటి నుండి అలాంటి మాట..ఫ్యాన్స్ కి కడుపునిండిపోయింది పో..!
ఇలాంటి సమయంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్‌పై స్పందించడం మరింత హైలైట్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన ‘బైకర్’ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ, దాని వైబ్ ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ట్రైలర్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉందని చెప్పిన ప్రభాస్, శర్వానంద్‌తో పాటు యూవి క్రియేషన్స్ మరియు మొత్తం టీమ్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సాధారణంగా ప్రభాస్ ఇతర సినిమాల గురించి చాలా అరుదుగా స్పందిస్తారు. ఆయన తన పనిలోనే బిజీగా ఉండి, పెద్దగా ఎవరి సినిమాలపై కామెంట్స్ చేయరు. అలాంటి ప్రభాస్, ‘బైకర్’ ట్రైలర్‌ను ఇంత పాజిటివ్‌గా అభినందించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ రియాక్షన్‌ను చూసిన ఫ్యాన్స్ “ఇది నిజంగా గూస్‌బంప్స్ ఇచ్చే విషయం” అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి, ‘బైకర్’ సినిమా ట్రైలర్‌తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. శర్వానంద్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమా చుట్టూ ఏర్పడిన బజ్ చూస్తుంటే, విడుదలకు ముందే విజయం వైపు దూసుకుపోతున్నట్టే కనిపిస్తోంది.