టి20 ఫార్మాట్లో.. చరిత్ర సృష్టించిన రోహిత్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రదర్శన చేస్తూ ఉంటాడు. ఇక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఆట తీరుపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరైన  టి20 ఫార్మాట్లో రోహిత్ రోహిత్ చెలరేగిపోయే తీరు మాటల్లో వర్ణించడం కూడా కష్టమే.

 అతని దూకుడైన బ్యాటింగ్ ముందు బంతి ఎక్కడ వెయ్యాలో కూడా తెలియక బ్యాట్స్మెన్లు అందరూ కూడా తికమక పడిపోతూ ఉంటారు అని చెప్పాలి  అలాంటి రోహిత్ శర్మ ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఎప్పటికప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డులను కొల్లగొడుతూనే  ఉంటాడు అని చెప్పాలి  కాగా ప్రస్తుతం భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ హాఫ్ సెంచరీ తో అయితే ఒక అరదైన రికార్డ్ సృష్టించాడు.

 అంతర్జాతీయ టి20 క్రికెట్ లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడవ బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ కంటే ముందు కేవలం ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అందులో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. అయితే అతి తక్కువ బంతుల్లోనే 4000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్మెన్ గా మాత్రం రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: