మ్యాచ్ గెలుస్తామని KKR కు ముందే తెలుసా.. అందరూ షాక్?

praveen
ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరిని కూడా అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది. ఇక ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో కోల్కతా నైట్ రైడర్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగకుండా అని విభాగాల్లో కూడా అత్యుత్తమంగా రానించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు.  ఇక సన్రైజర్స్ ను చిత్తుగా ఓడించింది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో మూడోసారి అటు కోల్కతా జట్టు ఐపిఎల్ టైటిల్ నీ ముద్దాడింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు కోల్కతా జట్టు గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోల్కతా జట్టుకు ఐపీఎల్ లో గెలుస్తామని ముందే తెలుసా అని అనుమానం ప్రస్తుతం అందరిలో కలుగుతుంది. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ లోకి ప్రవేశించడంతోనే ఇక టైటిల్ వారిదే అన్న విషయాన్ని నమ్మింది. ఈ క్రమంలోనే ఫైనల్లో విజయం అనంతరం చేసే సెలబ్రేషన్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలోనే కేకేఆర్ ఛాంపియన్స్ ట్యాగ్ లైన్ తో టీ షర్టులను కూడా ముద్రించుకుంది.

 ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి ఐపీఎల్ టైటిల్ అందుకున్న తర్వాత ఇక జట్టులోని సభ్యులందరూ వెంటనే ఛాంపియన్స్ టీ షర్టులను ధరించి మైదానం లో సందడి చేశారు   దీంతో ఇక ఇప్పుడు కేకేఆర్ ఛాంపియన్ టీ షర్ట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కి ముందే గెలుస్తామని కోల్కత్తా జట్టు విశ్వాసం అందరిని ఫిదా చేసేస్తూ ఉంది.  ఇక ఆ జట్టు ఆత్మవిశ్వాసానికి ఇక ఈ టీషర్టులే కారణం అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఫైనల్ మ్యాచ్లో అటు హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులు చేయగా.. తర్వాత లక్ష్య చేదనకు దిగిన కోల్కతా జట్టు 10.3 ఓవర్లలోనే 114 పరుగులు చేసి ఐపిఎల్ విజేతగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: