ఈ లాజిక్ ప్రకారం ట్రోఫీ "SRH" కే..?

Pulgam Srinivas
(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి ఫైనల్ వరకు చేరుకుంది. ఇక లీగ్ దశలో సన్రైజర్స్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దానితో ఈ జట్టు ప్లే ఆప్స్ లో భాగంగా మొదటి మ్యాచ్ ను పాయింట్ల పట్టిక లో మొదటి స్థానంలో ఉన్న కోల్కతా జట్టుతో ఆడింది.

ఇక ఇందులో సన్రైజర్స్ జట్టు ఓడిపోయింది. ఇక ఆ తర్వాత ప్లే ఆప్స్ భాగంగా బెంగళూరు తో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి తలపడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. దీనితో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు వెళ్ళింది. ఇక రేపు కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇకపోతే కొన్ని లాజిక్ లను బట్టి చూసినట్లు అయితే సన్రైజర్స్ జట్టు రేపు మ్యాచ్ గెలవబోతున్నట్లు తెలుస్తుంది. ఆ లాజిక్ ఏమిటో తెలుసుకుందాం.

2008 వ సంవత్సరం (ఐ పి ఎల్) మొదటి సీజన్ ప్రారంభం అయింది. ఇందులో దక్కన్ చార్జెస్ జట్టు ఆ సంవత్సరం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. రెండవ సీజన్ అయినటువంటి 2009 వ సంవత్సరం దక్కన్ చార్జెస్ జట్టు ట్రోఫీ ని గెలుచుకుంది. ఆ విధంగా చూసినట్లు అయితే పోయిన సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ సారి హైదరాబాద్ జట్టు ఫైనల్ కు వెళ్ళింది. దానితో ఈ సారి హైదరాబాద్ జట్టు దే విజయం అని చాలా మంది ఈ లాజిక్ ప్రకారం మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

srh

సంబంధిత వార్తలు: