కోహ్లీ భద్రతకు ముప్పు.. క్లారిటీ ఇచ్చిన GCA?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అద్భుతంగా రానించి టైటిల్ విజేతగా నిలుస్తుంది అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పటిలాగానే భారీ అంచనాలను క్రియేట్ చేసి.. మరోసారి నిరాశపరిచింది. అయితే ఐపీఎల్ టోర్నీ మొదట్లో వరుస పరాజయాలతో సతమతమైన టీం ఇక ఆ తర్వాత మాత్రం విజయాల బాట పట్టింది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో చిట్ట చివరన కొనసాగిన ఈ జట్టు.. ఇక అనుహ్యంగా అటు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఆర్సిబి జట్టు దూకుడు చూస్తే తప్పకుండా ఐపీఎల్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో ఆ జట్టు అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ఆర్సిబి ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆర్సిబి ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే అటు మ్యాచ్ జరగడానికి ముందు రోజు ఆర్సిబి ప్రాక్టీస్ సెషన్ కి దూరంగా ఉంది. ఉగ్రవాదుల నుంచి హెచ్చరికల కారణంగానే ఇలా ప్రాక్టీస్ కి దూరంగా ఉంది అని అందరూ అనుకున్నారు.

 అయితే కోహ్లీ భద్రతకు ముప్పు ఉంది అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. ఇదే విషయం గురించి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. కేవలం ఎండ వేడిమి కారణంగానే ప్రాక్టీస్ సెషన్ కు ఆర్సిబి దూరంగా ఉంది అంటూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఉగ్రవాదుల ముప్పు వంటిది ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ఆర్సిబి, రాజస్థాన్ జట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చాం. కానీ వేడి వల్ల ఇండోర్ ప్రాక్టీస్ కే ఆర్ సి బి మొగ్గుచూపింది అంటూ స్పష్టం చేసింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: