హీరోయిన్ కాజల్.. ఫేవరెట్ SRH ప్లేయర్ ఎవరో తెలుసా?

praveen
సౌత్ ఇండస్ట్రీలో లేడీ క్వీన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎంతోమంది కుర్ర హీరోయిన్లు వచ్చి పోయిన కాజల్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా జోడి కట్టి అదరగొట్టిన ఈ సొగసరి.. ఇక సీనియర్ హీరోలతో కూడా నటించి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది.

 అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్.  పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ కాజల్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఇక ఇప్పుడు కాజల్ ప్రధాన పాత్రలో నటించినా సత్యభామ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇక ఈ టాలీవుడ్ చందమామ బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ హీరోయిన్.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో తెలుగు టీం అయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అన్న విషయాన్ని ఇటీవల కాజల్ తెలిపింది. సన్రైజర్స్ హైదరాబాద్ లో తన ఫేవరెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ హీరోయిన్ కాజల్ తెలిపింది. తనకు ఇష్టమైన ఐపీఎల్ టీం సన్రైజర్స్ అంటూ ఇక సత్యభామ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఫేవరెట్ ఫిలిం సెంట్ ఆఫ్ ఉమెన్ అంటూ తెలిపింది. ఆల్ టైం ఫేవరెట్ కోస్టార్ మెగాస్టార్ చిరంజీవి అంటూ తెలిపిన కాజల్.  ఇక ఓవరాల్ క్రికెట్లో చూసుకుంటే ధోని తన ఫేవరెట్ క్రికెటర్ అంటూ చెప్పకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: