అందుకే ఓడిపోయాం.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన RCB కెప్టెన్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ అండ్ లక్కీ టీం ఏది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు. ఎందుకంటే 17 ఏళ్ల ఐపీఎల్ సీజన్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది ఈ జట్టు. ఇక ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. అయితే వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకంటే ఆ జట్టుకు మాత్రం ఎప్పుడు అదృష్టం కలిసి రాలేదు.

 కొన్ని కొన్ని సార్లు లీగ్ మ్యాచ్లలో అద్భుతంగా రాణించిన ఈ జట్టు ఇక కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తూ ఉంటుంది అని చెప్పాలి  అయితే 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఇదే జరిగింది. తప్పకుండా బెంగళూరు టీం టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మొదట్లో వరుస పరాజయాలు పాలు కావడంతో ఆ నమ్మకం అందరిలో పోయింది. కానీ ఆ తర్వాత విజయాల బాట పట్టింది బెంగళూరు టీం. అనూహ్యంగా ప్లే ఆఫ్ లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.

దీంతో rcb కి ఈసారి అదృష్టం కలిసి వస్తుందని తప్పకుండా టైటిల్ గెలుస్తుందని అనుకున్నారు అభిమానులు. కానీ ఊహించని రీతిలో అటు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమితో అందరూ నిరాశలో మునిగిపోయారు. కాగా ఇక రాజస్థాన్ చేతిలో ఓటమిపై అటు బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లెసెస్ స్పందించాడు. రాజస్థాన్తో మ్యాచ్లో బ్యాటింగ్లో మెరుగ్గా రాణించలేకపోయాం అంటూ డూప్లెసిస్  చెప్పుకొచ్చాడు  మరో 20 పరుగులు చేసి ఉంటే టార్గెట్ ను డిపెండ్ చేసుకునే ఛాన్స్ ఉండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు పెద్దగా ఉపయోగపడలేదని తెలిపాడు. అయితే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఎలిమినేటర్ వరకు రావడం గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: