వామ్మో: ప్రేమ కోసం చైతన్య అలాంటి పని చేసేవాడా.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత..!

Divya
ఇటీవలే నాగచైతన్య , శోభిత ప్రేమించుకొని మరి చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.. వివాహమనంతరం ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరి పరిచయం ప్రేమ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఇందులో అటు నాగచైతన్య, శోభిత గురించి కొన్ని తెలియని విషయాలు కూడా తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

2018లో నాగార్జున ఇంటికి శోభిత వెళ్లిందట. ఆ తర్వాత 2022లో నాగచైతన్యతో తనకు స్నేహం ఏర్పడిందని తెలియజేసింది. 2022 ఏప్రిల్ నుంచి తన ఇంస్టాగ్రామ్ లో నాగచైతన్యను తాను ఫాలో అవుతున్నట్లు తెలిపింది.. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని తాను చైతన్య ఎప్పుడు కలిసినా కూడా వీటి గురించి ఎక్కువగా మాట్లాడే వారు.. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనని ఎప్పుడు అడిగే వారిని కూడా వెల్లడించింది. అలా మాట్లాడటం వల్ల తమ బంధం మరింత బలపడిందని.. తాను సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటానని తాను పెట్టే గ్లామర్ ఫోటోలు కాకుండా ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథనాలు తన అభిప్రాయాల గురించి ఎప్పుడూ లైక్ చేసే వారిని శోభిత వెల్లడించింది.

ఇక మొట్టమొదటిసారి తాము ముంబైలో ఒక కేఫ్ లో కలుసుకున్నట్లుగా శోభిత వెల్లడించింది.. అయితే అప్పుడు నాగచైతన్య హైదరాబాదులో ఉండేవారని తాను ముంబైలో ఉన్నామని కానీ తనకోసం హైదరాబాదు నుంచి ముంబైకి వచ్చేవారని వెల్లడించింది.. ఇక మొదటిసారి తాము కలుసుకున్నప్పుడు శోభిత రెడ్ డ్రస్సు వేసుకున్నానని చైతన్య బ్లూ షూట్ వేసుకున్నారని తెలిపింది. నాగచైతన్య కుటుంబం న్యూ ఇయర్ వేడుకలకు తనని ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆ మరుసటి సంవత్సరం చైతన్య తన కుటుంబాన్ని కలిశారని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తనకోసం మాత్రం ముంబైకి వచ్చేవారని శోభిత వెల్లడించింది అయితే ఇది సుమారుగా రెండేళ్ల క్రితం నుంచి జరిగినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: