అదే బెడిసి కొట్టింది.. అందుకే ఓడిపోయాం : కమిన్స్

praveen
2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం బౌలింగ్ విభాగం పైన మాత్రమే ఆధారపడుతూ వచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం బ్యాటింగ్లో కూడా తమకు తిరుగులేదు అని నిరూపించుకుంది.ఏకంగా విధ్వంసకరమైన ఆట తీరుతో మహా మహా జట్లకు సైతం ముచ్చెమటలు పట్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్లను రెండుసార్లు బద్దలు కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.

ప్యాట్ కమిన్స్ సారథ్యంలో తిరుగులేని జట్టుగా అవతరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఈ ఐపీఎల్ టోర్నీ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన సన్రైజర్స్ కు మొదటి అడుగులోనే ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి కోల్కతా విజయం సాధించి నేరుగా ఫైనల్ అడుగుపెట్టింది. సన్రైజర్స్ మాత్రం ఓడిపోయి చివరికి రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆ జట్టు అభిమానులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే మొదటి క్వాలిఫైర్ లో మ్యాచ్లో కోల్కతా జట్టు చేతిలో ఓటమిపై స్పందించిన సన్రైజర్స్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరిగే చెన్నై వికెట్ తమకు సరిగ్గా సరిపోతుందని.. అక్కడ గేలుస్తామని నమ్మకం ఉంది ఉంటే అంటూ తెలిపాడు. కేకేఆర్ అనే విభాగాల్లో కూడా అద్భుతంగా రాణించింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని ఉపయోగించుకోవాలి అని ఉద్దేశంతో సన్వీర్ కి ఛాన్స్పిచ్చామ్. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది అంటూ ప్యాంట్ కామెంట్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: