నెలనర ముందే ఆ మ్యాచ్ టికెట్స్ సోల్డ్ అవుట్.. ఆ మ్యాచ్ కి అంత క్రేజా..?

Pulgam Srinivas
టి20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా ఎక్కువ శాతం క్రికెట్ అభిమానులు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో కొన్ని రోజుల క్రితమే (ఐ పీ ఎల్) ఇండియాలో స్టార్ట్ అయింది. ఇక క్రికెట్ అభిమానులు అంతా ఇప్పుడు ప్రస్తుతం (ఐ పీ ఎల్) మూడ్ లో ఉన్నారు. ఇక (ఐ పీ ఎల్) సీజన్ చివరి దశకు చేరుకుంది. దాదాపు వారం రోజుల్లో ప్లే ఆప్స్ లోకి వెళ్ళబోయే జట్లు ఏవి అనేది క్లియర్ గా తెలుస్తోంది.

ఆ తర్వాత మరో వారం రోజుల్లో (ఐ పీ ఎల్ 2024) కంప్లీట్ కానుంది. ఆ తర్వాత టీ 20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. టీ20 వరల్డ్ కప్ పై కూడా ఇండియా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి రోహిత్ శర్మ నేతృత్వంలో ఇండియా జట్టు వరల్డ్ కప్ ను దక్కించుకుంటుంది అని ఇండియా అభిమానులు అంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే జూన్ 29 వ తేదీన బార్బొడోస్ లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్ లు ఇప్పటికే మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్ లను కొంత సమయం క్రితం ఆన్లైన్ లో ఉంచగా ఇవి గంటల్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి. రూపాయలు 500 నుంచి 30 వేల వరకు ధర ఉన్న 28 వేల టికెట్లు మొత్తం చాలా తక్కువ సమయంలోనే అమ్ముడు పోవడంతో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉన్నది అనేది దీని ద్వారా క్లియర్ గా అర్ధం అవుతుంది. మరి వరల్డ్ కప్ ఫైనల్ కు ఏ జట్లు చేరుకుంటాయా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wc

సంబంధిత వార్తలు: