జడేజా తొండాట.. రాజస్థాన్ కోచ్ కీలక వ్యాఖ్యలు?

praveen
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉంటాడు జడేజా.  ఇక అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. క్లిష్టమైన సమయాల్లో బ్యాటింగ్ కి వచ్చి మెరుపులు మెరూపిస్తూ ఉంటాడు. ఇక తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్ధులను  తికమక పెడుతూ వికెట్లు పడగొడుతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఒక రకంగా ప్రస్తుతం భారత క్రికెట్లో మూడు ఫార్మాట్లకు ప్లేయర్గా కొనసాగుతూ వున్నాడు. ఇక ఎప్పుడూ జట్టు కోసం తన అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే క్రికెట్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. కానీ అలాంటి రవీంద్ర జడేజా ఈ మధ్యకాలంలో మాత్రం తొండాట ఆడుతున్నాడా అంటే మాత్రం ఇక అతని తీరు చూస్తే అవును అని సమాధానం చెబుతున్నారు నెటిజెన్స్.  ఎందుకంటే తెలివిగా రూల్స్ అతిక్రమించడానికి ప్రయత్నిస్తూ చివరికి దొరికిపోతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు రవీంద్ర జడేజా.

 ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి రవీంద్ర జడేజా తొండాట ఆడి అభిమానులకు సైతం చిరాకు తెప్పించాడు. ఏకంగా రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ సంజు  వేసిన  త్రో కి అడ్డు రావడంతో ఎంపైర్ రవీంద్ర జడేజాను అవుట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో సన్రైజర్స్ తో మ్యాచ్ లోను జట్టు ఇదే తరహాలో అడ్డు రాగా  ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ అప్పీల్ వెనక్కి తీసుకోవడంతో ఇక జడేజా వికెట్ కోల్పోలేదు. అయితే ఇదే విషయంపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగకర మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జడ్డు విషయంలో తాము చేసింది కరెక్టే అంటూ వ్యాఖ్యానించాడు. జడ్డు సరాసరి వెనక్కి పరిగెత్తకుండా బంతికి అడ్డు వచ్చేందుకు ప్రయత్నించాడని.. అందుకే అతన్ని వికెట్ ప్రకటించారు అంటూ సంగకర  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: