పాక్ ప్లేయర్ ఫై ప్రశంస.. జోక్ ఆఫ్ ది ఇయర్ అంటున్న నేటిజన్స్?

praveen
పాకిస్తాన్ ఆటగాళ్లు ఏం చేసినా అది సోషల్ మీడియాలో ఎప్పుడు సెన్సేషన్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన పని ఏదైనా ఎప్పుడు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఏకంగా తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడంలో ఆ దేశ ఆటగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. అదే సమయంలో భారత క్రికెటర్లఫై విమర్శలు గుప్పించడంలో కూడా ముందుంటారు అని చెప్పాలి. భారత క్రికెటర్లకంటే తాము గొప్పవాళ్ళు అని ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు.

 ఇంకోవైపు ఇక తమ ఆట తీరుతో కూడా ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు పాకిస్తాన్ క్రికెటర్లు. తప్పకుండా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో చిన్న చిన్న తప్పిదాలు చేసి ఓడిపోవడం.. తప్పకుండా ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో గెలవడం.  కేవలం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాత్రమే సాధ్యమవుతుంది  సాధరణంగా సొంత డబ్బా కొట్టుకోవడం అంటూ ఉంటారు కదా. ఇక ఇలాంటి విషయంలో ఎప్పుడు పాక్ ప్లేయర్లు ముందుంటారు. ఇక ఇటీవల ఇలాంటి సొంత డబ్బాతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు.

 పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఫై ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆప్రీది ప్రశంసలు కురిపించాడు. ఇలా ప్రశంసలు కురిపించడంలో తప్పేమీ లేదు. కానీ ఏకంగా మహమ్మద్ రిజ్వాన్ ను క్రికెట్ లెజెండ్ బ్రాడ్ మాన్ తో పోల్చాడు షాహిన్ అఫ్రీది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆఫ్రిదిని  ఏకీపారేస్తున్నారు. జోక్ ఆఫ్ ది ఇయర్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మహమ్మద్ రిజ్వాన్ బ్రాడ్ మాన్ కాదు బ్రెడ్ మ్యాన్ అని ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. రిజ్వాన్ ను బ్రాడ్మన్ తో పోల్చి ఆయన గౌరవాన్ని తగ్గించోద్దు అంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: