కోహ్లీ గిఫ్ట్ ను విరగొట్టేసిన ఆటగాడు..!

MADDIBOINA AJAY KUMAR
ఇండియన్ క్రికెట్ టీం లో అత్యంత క్రేజ్ కలిగిన ఆటగాలలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన అద్భుతమైన ఆట తీరుతో తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అలాగే ఎన్నో ట్రోఫీలను కూడా అందించాడు. ఇంతటి సామర్థ్యం కలిగిన ఈ ఆటగాడు చాలా సంవత్సరాల పాటు ఇండియన్ క్రికెట్ టీం కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇకపోతే తన సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీం అద్భుతమైన ఎన్నో ఇన్నింగ్స్ లను ఆడి , ఎన్నో విజయాలను సాధించింది.

ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్ 2024" లో ఆడుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం "ఐ పి ఎల్" లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం తరపున ఆడుతున్నాడు. ఈ టీం ప్రస్తుతం చాలా ఘోరమైన ప్రదర్శనను కనబరుస్తున్నప్పటికీ ఈయన మాత్రం తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బెంగళూరు జట్టు కోల్కతా తో తలపడింది. ఇందులో బెంగళూరు ఓడిపోయింది. కోల్కతా గెలిచింది. కోల్కతా గెలిచిన అనంతరం కోహ్లీ తన బ్యాట్ ను రింకూ కి గిఫ్టుగా ఇచ్చారు.

అయితే రింకు ఓ స్పిన్నర్ బౌలింగ్ లో ఆడుతున్న సమయంలో ఆ బ్యాట్ విరిగిపోయిందట. తాజాగా ఈ విషయాన్ని కోహ్లీ కి రింకు చెప్పాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన సోషల్ మీడియా హ్యాండ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే బెంగళూరు చాలా మ్యాచులు ఆడి ఎక్కువ మ్యాచ్ లను ఓడిపోవడంతో ఈ సంవత్సరం ఈ జట్టు ప్లే ఆప్స్ కి కూడా వెళ్లే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: