మేము కలవలేదు.. ఇదంతా ఫేక్ న్యూస్ : రోహిత్

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా కు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కెప్టెన్లు మారిన అటు టీమిండియా కు వరల్డ్ కప్ మాత్రం దక్కడం లేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచినంత పని చేసింది. ఇక మొదటి మ్యాచ్ నుండి సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోయింది టీమిండియా. ఫైనల్ లో కూడా ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించడం ఖాయమని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించిన రీతిలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి అభిమానులందరికీ కూడా నిరాశపరిచింది భారత జట్టు. దీంతో మరోసారి వరల్డ్ కప్ టైటిల్ కలగానే మిగిలిపోయింది. అయితే గత ఏడాది లాగా కాకుండా ఈసారి మాత్రం తప్పకుండా వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ టీం తో బరిలోకి దిగబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ లో రాణించిన ఎంతోమంది ఆటగాళ్లకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది.

 అయితే ఇలా వరల్డ్ కప్ టీం సెలక్షన్ కోసం ఇప్పటికే కెప్టెన్ రోహిత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కోచ్ రాహుల్ సమావేశం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయ్. అయితే ఇదే విషయం గురించి అటు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ టీం సెలక్షన్ కోసం కోచ్, చీఫ్ సెలెక్టర్ సహ తాను సమావేశమైనట్లు వస్తున్న వార్తలు లో నిజం లేదని అదంతా ఫేక్ న్యూస్ ఏంటో చెప్పుకొచ్చాడు. నేను ఎవరిని కలవలేదు. అగర్కార్ గోల్ఫ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లారు. ఇక ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో గడుపుతున్నారు. మేము కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఉంటే మా ముగ్గురిలో ఎవరు ఒకరం అందరికీ తెలియజేస్తాం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: