ఐపీఎల్ : మొదటి సీజన్ నుంచి ఇప్పటికి ఆడుతున్న ప్లేయర్లు వీరే?

praveen
వరల్డ్ క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా టీ20 టోర్నిగా  ప్రారంభమైన ఐపిఎల్ ఏకంగా ప్రస్తుతం  క్రికెట్లో రిచ్చేస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్ కి ఎంతో మంది కొత్త స్టార్స్ ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా రాణిస్తున్న వారందరూ ఒకప్పుడు ఐపీఎల్ లో యువ ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కావడం గమనార్హం.

 అయితే దాదాపు గత పదహారేళ్ల నుంచి ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న ఐపీఎల్ 17వ బర్త్ డే జరుపుకుంది. ఈ క్రమంలోనే ఐపిఎల్  ఎంతో విజయవంతంగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి ఎన్నో విశేషాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపిఎల్ మొదలైన 2008లో మొదటి సీజన్లో ఆడిన ఆటగాళ్లు.. ఇక ఇప్పుడు 17వ సీజన్లో కూడా ఎవరు ఇంకా ఆటను కొనసాగిస్తున్నారు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటి సీజన్లో ఆడిన చాలామంది ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించగా కేవలం కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఇంకా ఐపీఎల్లో కొనసాగుతూ ఉన్నారు.

 ఇప్పటికే వందల మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని ప్రపంచ క్రికెట్కు పరిచయం చేసిన ఐపిఎల్ లో ఇక ఇలా మొదటి సీజన్ ఆడి ప్రస్తుతం ఆడుతున్న వారిలో మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, మనీష్ పాండే, శిఖర్ ధావన్, రహనే, దినేష్ కార్తీక్, అశ్విన్లు ఉన్నారు. ఇలా ప్రస్తుతం వివిధ జట్ల తరపున కొనసాగుతున్న ఈ స్టార్ ప్లేయర్లందరూ కూడా 2008లో ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్లో కూడా ఆడిన వారే కావడం గమనార్హం. ఇలా ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ఆడి ప్రస్తుతం కూడా ఐపీఎల్ లో కొనసాగుతున్న విదేశీ క్రికెటర్లు మాత్రం ఎవరూ లేరు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: