అప్పుడు కెప్టెన్.. కానీ ఇప్పుడు జట్టులోనే లేడు?

praveen
2024 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన కోల్కతా టీమ్ నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది. పాయింట్లో పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. గౌతమ్ గంభీర్ మెంటార్ గా వచ్చిన తర్వాత ఇక ఆ జట్టు ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులపై పూర్తిస్థాయిలో పైచేయి సాధిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అదరగొడుతుంది.

 అత్యుత్తమ ప్లేయింగ్ తో బరిలోకి దిగుతూ ఆటతీరుతో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.  గతంలో శ్రేయస్ గాయం బారిన పడిన సమయంలో ఆ జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించిన ఆటగాడు ఇక ఇప్పుడు తుది జట్టులో ఎక్కడ కనిపించడం లేదు. ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోకుండా చివరికి బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. అతను ఎవరో కాదు నితీష్ రానా. ప్రస్తుతం కోల్కతా జట్టులో అతని పరిస్థితి అగమ్య గోచరంగా  మారిపోయింది.

 గత ఏడాది రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యారు గైర్ హాజరుతో కోల్కతా జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గానే వ్యవహరించాడు నితీష్ రానా. కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు అటు బ్యాటింగ్ లోను అదరగొట్టాడు. కానీ ఇప్పుడు 2024 సీజన్ కి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా అతను జట్టులో కనిపించకుండా పోయాడు   ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 మ్యాచ్లు ఆడితే ఒక్కదాంట్లో కూడా నితీష్ రానా తుది జట్టులో చోటు సంపాదించుకోకపోవడం గననార్హం. ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే అతను ఆడాడు. అయితే ఇలా అతన్ని ఎందుకు జట్టు నుంచి తప్పించారు అనే విషయంపై మాత్రం కారణాలు తెలియ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: