కోట్లు పెట్టి తీసుకుంది.. ఇలా బెంచ్ పై కూర్చోబెట్టడానికా.. ఆర్సీబీపై ఫ్యాన్స్ ఫైర్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఏదైనా టీమ్ దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 17 ఏళ్ల ఐపీఎల్ కెరియర్ లో ఈ జట్టును వెంటాడినంతగా ఇంకే టీమ్ ను  దురదృష్టం వెంటాడ లేదేమో అనే భావన ఇప్పటికే ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అన్ని టీమ్స్ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి. కానీ అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ కలను నెరవేర్చుకోలేకపోయింది.

 అయితే మిగతా టీమ్స్ లో పెద్దగా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేక విఫలమవుతే.  అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరితో జట్టు నిండిపోయి ఉన్నప్పటికీ పేలవ ప్రదర్శన చేస్తూ ఉంటుంది. మిగతా టీమ్స్ లో ఉన్నప్పుడు అదరగొట్టే ఆటగాళ్లు బెంగళూరు టీం లోకి రాంగానే తుస్సు మనిపిస్తూ ఉంటారు. దీంతో మహా మహా ప్లేయర్ల జట్టులో ఉన్న ఆ టీమ్ మాత్రం వరుస ఓటములతో సతమతమవుతూ ఉంటుంది. 2024 ఐపిఎల్ సీజన్ లో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక విజయం మాత్రమే సాధించింది.

 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పలు మార్పులు చేర్పులు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఏకంగా కోట్లు పెట్టి తీసుకున్న ఆటగాళ్లను బెంచికే పరిమితం చేసింది ఆర్సిబి జట్టు. ఏకంగా 17.5 కోట్లు పెట్టి తీసుకున్న కామరూన్ గ్రీన్, 11.5 కోట్లు పెట్టి తీసుకున్న అల్సారి జోసెఫ్, 11 కోట్లకు కొనుగోలు చేసిన మ్యాక్స్ వెల్, ఏడు కోట్లతో రిటైన్ చేసుకున్న సిరాజ్ లాంటి కాస్లీ ప్లేయర్లను సైతం అటు ఆర్సీబీ బెంచ్ కి పరిమితం చేస్తుంది. ఇలా జట్టులో ఎన్ని మార్పులు చేసినప్పటికీ చివరికి సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: