సిక్సర్లు కొట్టడంలో.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు?

praveen
ప్రస్తుతం టీమిండియా కు మూడు ఫార్మాట్ లలో కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా కూడా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే . ఇక ఎప్పుడూ అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ ఉంటాడు రోహిత్ శర్మ. అయితే ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్ ను మించిన ఆటగాడు మరొకరు లేరేమో అనే విధంగా వీరబాదుడు బాదుతూ ఉంటాడు. రోహిత్ ఎంతో సొగసైన షాట్లతో సిక్సర్లు బాదుతున్న తీరు చూసి అభిమానులు మురిసిపోతూ ఉంటారు.

 బౌలర్ ఎంత వైవిధ్యమైన బంతివేసినప్పటికీ ఎంతో అలవోకగా బంతిని బౌండరీ అవతలికి తరలిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. అందుకే ఎంతోమంది అభిమానులు ఇక రోహిత్ శర్మని హిట్ మ్యాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది సిక్సర్ల కింగ్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఇక ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ సెంచరీ తో చలరేగిపోయాడు. కానీ ఇక ముంబై జట్టు ఓడిపోవడంతో రోహిత్ సెంచరీ వృధాగానే మారింది.

 కాగా రోహిత్ శర్మ ఇలా సెంచరీ చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ ఐదు సిక్సర్ల ద్వారా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు రోహిత్. ఏకంగా టి20 క్రికెట్లో (లీగ్ - ఇంటర్నేషనల్ కలిపి) ఇక రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 500 సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ పై మ్యాచ్లో మూడో సిక్సర్ కొట్టడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. ఓవరాల్గా  1056 సిక్సులతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత స్థానంలో పోలార్డ్ 860 రస్సెల్ 678 కలిస్  548 సిక్సర్లతో రోహిత్ కంటే ముందు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: