పంజాబ్ చెత్త రికార్డు.. హోమ్ గ్రౌండ్ లోనే?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ లో భాగంగా జరుగుతున్న వరుస మ్యాచ్ లు అసలు ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ను పంచుతూ ఉన్నాయి. ఇక ప్రతిరోజు ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి టీవీలకు అతుక్కుపోతున్నారు. కొంతమంది ప్రేక్షకులు ఇక స్టేడియం కు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ చూసి అసలు సిసలైన మజాని పొందుతున్నారు అనే విషయం తెలిసిందే.

 అయితే ఐపీఎల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బలిలోకి దిగిన కొన్ని టీమ్స్ మాత్రం నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సాదరణంగా ఏదైనా టీం తమ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడిందంటే తప్పకుండా ఆ జట్టుదే విజయం అని అభిమానులు అందరూ కూడా బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న టీమ్స్ సైతం ప్రత్యర్థుల  చేతిలో ఓడిపోతున్నాయి. ఇక ఇటీవలే పంజాబ్ కింగ్స్ జట్టు పరిస్థితి ఇలాగే మారింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఏకంగా హోమ్ గ్రౌండ్ లోనే ఓడిపోయింది.

 దీంతో ఇలా హోమ్ గ్రౌండ్ లో ఓటములలో చెత్త రికార్డును నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. హోమ్ గ్రౌండ్ లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు 73 మ్యాచ్లలో ఆ జట్టు సొంత మైదానంలోనే ఓడింది. దీంతో ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాత స్థానంలో ఇలా పంజాబ్ ను హోమ్ గ్రౌండ్ లో ఓడించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉండటం గమనార్హం. 72 సార్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు హోమ్ గ్రౌండ్ లోనే ఓడిపోయింది. ఆ తర్వాత స్థానంలో హోమ్ గ్రౌండ్లో 67 పరాజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: