హిందూ పండుగ జరుపుకున్న జహీర్ ఖాన్.. సోషల్ మీడియాలో తిట్లు?

praveen
భారతదేశం సకల మతాల సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని మతాలను సమానంగానే చూస్తూ ఉంటారు. హిందూ ముస్లిం భాయి భాయి అని అంటూ ఉంటారు. తమ దేవుని పూజించడం ఇతర దేవుళ్ళను గౌరవించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక వారి మత సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమందికి ఇతర మతాలకు చెందిన స్నేహితులు కూడా ఉంటారు. ఈ క్రమంలోనే ఇక వారి పండుగలకు సంబంధించిన సెలబ్రేషన్స్ లో మరో మతానికి చెందిన స్నేహితులందరూ కూడా పాల్గొనడం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎవరైనా ఇలాంటివి చేస్తే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.

 ఇక ఇప్పుడు టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. జహీర్ ఖాన్ ముస్లిం అన్న విషయం తెలిసిందే. అయితే ఆయన హిందూ మతానికి చెందిన సాగరికను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారి వైవాహిక జీవితం ఎంతో సాఫీ గానే సాగుతుంది. ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇటీవలే మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తన భార్య సాగరికతో కలిసి హిందూ పండుగ అయిన గుడి పడ్వాను సెలబ్రేట్ చేసుకున్నారు.

 ఈ క్రమంలోనే ఈ సెలబ్రేషన్స్ లో దిగిన ఫోటోలని జహీర్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారిపోయాయి. కాగా జహీర్ ఖాన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు అటు ఇస్లామిస్టులకు ఆగ్రహం తెప్పించాయ్. దీంతో హిందూ పండుగను జరుపుకున్న జహీర్ ఖాన్ ను ఉద్దేశిస్తూ దుర్భాషలాడారు ఇస్లామిస్టులు. జహీర్ ఖాన్ మూర్ఖుడు అతనికి ఇస్లాంపై విశ్వాసం బలహీనంగా ఉంది. తన భార్యను ఈ మతంలోకి మార్చలేకపోయాడు అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొంతమంది అన్ని మతాలను గౌరవించే దేశంలో పుట్టిన జహీర్ ఖాన్ ఇక హిందూ పండుగను సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు అంటూ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: