ఐపీఎల్ : నేడు డబుల్ ధమాకా.. ఎవరు గెలుస్తారో?

praveen
ఐపీఎల్ ప్రారంభమైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెలన్నర పాటు జరిగే ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడు రెడీ గానే ఉంటారు. అయితే కొంతమంది ఇంట్లో కూర్చుని టీవీలో మ్యాచ్ వీక్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటే.. ఇంకొంతమంది బయటికి వెళ్లినవారు  మొబైల్ లో స్ట్రీమింగ్ అయ్యే ఐపీఎల్ మ్యాచ్లను లైవ్ చూడటం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏకంగా స్టేడియం కు వెళ్లి తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతూ మ్యాచ్ వీక్షించి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 కాగా ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు దేశంలోని 10 వేదికలలో జరుగుతూ ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్  పొందుతున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు క్రికెట్ ప్రేక్షకులకు పండగ రోజె. ఎందుకంటే ప్రతిరోజు ఒక మ్యాచ్ జరుగుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. కానీ వారాంతంలో శని ఆదివారాలు అయితే ఈ పండగ డబుల్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే శని ఆదివారాల్లో ఏకంగా ఒకటి కాదు రెండు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఈ డబుల్ ధమాకాని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. కాగా నేడు ఇక ఇలాంటి డబుల్ ధమాకా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

 నేడు రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ గా పిలుచుకునే వాంకడే స్టేడియంలో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటివరకు ఢిల్లీ నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్క విజయం సాధించగా.. ముంబై ఇంకా బోనీ కొట్టలేదు. ఇక రెండో మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు లక్నో, గుజరాత్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్లో జరగబోతుంది. గుజరాత్ నాలుగు మ్యాచ్లలో రెండు  విజయాలు సాధించగా.. లక్నో మూడింటిలో రెండు విజయాలు సాధించింది. కాగా నేడు ఎంతో రసవతరంగా సాగబోయే డబ్బులు ధమాకా పోరుని చూసేందుకు ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: