మా వాళ్ళ ఆట చూసి.. నాకే సిగ్గేసింది : రికీ పాంటింగ్

praveen
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత క్రికెట్ ప్రేక్షకులందరి కన్ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శన పైనే ఉంది. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ పంత్ గాయం నుంచి కోలుకొని ఇక మళ్ళీ తిరిగి జట్టులో చేరాడు. అయితే అతని కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం పైన అందరి దృష్టి ఉంది  కాగా రిషబ్ పంత్ కెప్టెన్సీ లో తప్పకుండా ఈ ఏడాది టైటిల్ గెలిచి తీరుతుంది అని ఆ జట్టు అభిమానులు కూడా బలంగా నమ్మారు.


 కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్  అటు టైటిల్ గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగు పెడుతుందా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే వరుసగా ఓటములు చవిచూస్తూ ఆ జట్టు తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది. అటు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో రిషబ్ పంత్ పర్వాలేదు.. అనిపిస్తున్నప్పటికీ ఇక సమిష్టిగా మాత్రం జట్టుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఇప్పుడు వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.


 ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఈ ఓటమిపై ఆ జట్టుకు పాంటింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మా జట్టు తొలి అర్ధభాగం ఆట చూసి సిగ్గుపడ్డాను. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి రెండు గంటల టైం పట్టింది. రెండు ఓవర్లు వేయడంలో వెనుకబడిపోవడంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ బయట ఫీల్డర్లను పెట్టి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మేము చాలా తప్పులు చేశాం. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: