సూర్యకు ఎన్ఓసి.. కానీ ముంబై జట్టులో చేర్చుకుంటుందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని చాంపియన్ జట్టుగా కొనసాగుతూన్న ముంబై ఇండియన్స్.. ఇక ప్రతి ఏడాది కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఇక ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ దూసుకుపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి మాత్రం ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన చేసి అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తూ వచ్చింది.

 అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో చెత్త ప్రదర్శన చేయడంతో ఇక ఆ జట్టు అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే ఫ్రాంచైజీ సైతం చివరికి ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్తిక్ పాండ్యాకు టైటిల్ అందించింది. కనీసం హార్దిక్ కెప్టెన్సీలో అయిన ముంబై ఇండియన్స్ మంచి ప్రస్థానం కొనసాగిస్తుంది అనుకుంటే.. ఈ ఏడాది ఐపీఎల్ లో మరోసారి నిరాశ పరుస్తూ వస్తుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో మూడింటిలో కూడా ఓడిపోయిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

 దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే న్యూస్ అందింది. గత కొంతకాలం నుంచి గాయంతో క్రికెట్కు దూరమైన సూర్య కుమార్ యాదవ్ తిరిగి గ్రౌండ్ లోకి దిగబోతున్నాడట. ఐపీఎల్ ఆడేందుకు ఎన్సీఏ నుంచి ఎన్ఓసి జారీ అయ్యిందట. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో అతను చేరబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం నెట్ సెషన్ లో అతని పరిశీలించనుంది. తర్వాత అతని ఫిట్నెస్ ని బట్టి  ఏప్రిల్ ఏడవ తేదీన జరగబోయే మ్యాచ్లో జట్టులో చేర్చుతారా లేదా అనే విషయంపై క్లారిటీ రానుంది అని చెప్పాలి. కాగా సూర్య జట్టులో చేరితే అటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: