
ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీ.. కొత్త కుర్రాడు ఎంత వేగంగా వేశాడో తెలుసా?
అయితే ఇటీవల ఐపీఎల్లో భాగంగా లక్నో, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నువ్వా నేనా అంటూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో లక్నో జట్టు విజయం సాధించింది. అయితే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఓడిపోయిన లక్నో మూడో మ్యాచ్లో మాత్రం బోణి కొట్టింది అని చెప్పాలి. అయితే లక్నో విజయంలో కీలక పాత్ర వహించాడు యువ ఫేస్ బౌలర్ మయాంక్ యాదవ్. ఏకంగా ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనే ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసి తొలి మ్యాచ్ ఆడాడు. ఇక తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా కొట్టాడు అని చెప్పాలి.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫేస్ గన్ ఏకంగా 155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ 153 కిలోమీటర్ల వేగంతో బంతి విసరగా.. ఈ సీజన్ కు ఇదే ఫాస్టెస్ట్ బంతిగా కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు ని మయాంక్ యాదవ్ బద్దలు కొట్టాడు. ఇక అన్ని సీజన్ లు కలిపి ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ షాన్ టైట్ 157.71 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి.. ఇక ఇప్పటివరకు ఫాస్టెస్ట్ డెలివరీగా కొనసాగింది. ఈ కుర్రాడు దూకుడు చూస్తుంటే ఐపీఎల్ లో ఈ రికార్డును బద్దలు కొట్టేలాగే కనిపిస్తున్నాడు.