ధోని కెప్టెన్సీ పై.. స్టీవ్ స్మిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
అటు వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ కెప్టెన్లు ఉన్నప్పటికీ మహేంద్రసింగ్ ధోని మాత్రం తన కెప్టెన్సీ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. వికెట్ల వెనకాల ఉంటూ తన వ్యూహాల తో మ్యాచ్ స్వరూపాని మార్చేయగల సత్తా ధోనికి ఉంది. ఇక క్లిష్ట పరిస్థితుల్లో సైతం చిరునవ్వు తోనే ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు ధోని. అందుకే ఇక క్రికెట్లోకి రావాలి అనుకున్న ఎంతో మంది యువకులు ధోనిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ధోని ప్రతిభ గురించి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ ను ధోని కంటే గొప్పగా ఎవరు అర్థం చేసుకోలేరు అంటూ స్టివ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. వికెట్ల వెనుక మిస్టర్ కూల్ ను మించిన ఆటగాడు ఇండియా లో లేరు. అన్ని కోణాల్లోనూ ఆటను ధోని అర్థం చేసుకుంటాడు. గేమ్ బయట ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లో మాత్రం ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు. మహేంద్రుడి తో తో కలిసి ఆడటం నా కెరియర్లో నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇక ఆటపరంగా నాకు ఎంతగానో సహాయం చేశాడు అంటూ స్టేవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు.